మంచు మనోజ్ రెండో పెళ్లిపై మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు
- మనోజ్‌కు తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్న లక్ష్మి
- ఎవరి బతుకు వాళ్లను బతకనివ్వండని వ్యాఖ్య
- భూమా మౌనికారెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు
మంచు మనోజ్ గతంలో ప్రణతీరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ, 2019తో ఆమెతో విడిపోయినట్టు ప్రకటించాడు. అప్పటి నుంచి సింగిల్‌గా ఉన్న మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని ఈ మధ్య వార్తలు ఎక్కువయ్యాయి. ఏపీ మాజీ మంత్రి, టీడీపీకి చెందిన భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనికారెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకుంటాడన్న పుకార్లు వచ్చాయి. వీటికి బలం చేకూర్చేలా ఇటీవల ఓ వినాయక మండపంలో మనోజ్, మౌనికారెడ్డి కనిపించారు.