వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్పును ఇవ్వడం దారుణం: జగదీశ్ రెడ్డి
- యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలంటూ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు
- ఏదో కుట్ర జరుగుతోందన్న జగదీశ్ రెడ్డి
- తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని వ్యాఖ్య
ట్రైబ్యునల్ తీర్పు ఏకపక్షంగా ఉందని... దీనివల్ల యావత్ దేశానికి కూడా నష్టమని చెప్పారు. అన్ని చట్టాలకు లోబడే ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ట్రైబ్యునల్ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు. అనుకున్న సమయానికి ప్లాంటును పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు.