కుప్పంను పులివెందులతో సమానంగా అభివృద్ధి చేస్తానన్న జగన్ పై తులసిరెడ్డి విమర్శలు
- పులివెందులలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదన్న తులసిరెడ్డి
- వైఎస్ వివేకా కుమార్తె సునీత కుటుంబానికే రక్షణ లేదని వ్యాఖ్య
- అలాంటి పులివెందులను ఇతర నియోజకవర్గాలతో పోల్చడం సిగ్గుచేటని విమర్శ
పులివెందులలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదని తులసిరెడ్డి చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, జగన్ చెల్లెలు అయిన సునీత కుటుంబానికే పులివెందులలో రక్షణ లేదని చెప్పారు. అలాంటి పులివెందులను ఇతర నియోకవర్గాలతో పోల్చడం సిగ్గుచేటని అన్నారు. జగన్ ఇస్తున్న అమ్మఒడి, ఆసరా, చేయూత తదితరాలన్నీ నాన్న బుడ్డీకి చాలడం లేదని ఎద్దేవా చేశారు. ముట్టిముంత ఇచ్చి వెండి చెంబును దొంగిలించినట్టుగా వైసీపీ తీరు ఉందని అన్నారు.