ఈ నెల 27న ఢిల్లీకి రండి!... తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోం శాఖ లేఖలు!
- ఏపీ విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర హోం శాఖ దృష్టి
- పెండింగ్ అంశాలపై ఈ నెల 27న కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో సమీక్ష
- సమావేశానికి హాజరు కావాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు
ఈ క్రమంలో రాష్ట్ర విభజన చట్టంలోని ఇంకా అమలు కాని అంశాలపై చర్చకు కేంద్ర హోం శాఖ సిద్ధమైంది. ఈ దిశగా ఈ నెల 27న ఇరు రాష్ట్రాలతో సమావేశం కావాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి నిర్ణయించారు. ఈ క్రమంలోనే సదరు సమావేశానికి హాజరు కావాలంటూ ఆయన ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు రాశారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపైనే ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సమాచారం.