కాంట్రిబ్యూటరీ పెన్షన్ పై రెండు నెలల్లో నిర్ణయం: బొత్స సత్యనారాయణ
- సీపీఎస్ రద్దు అనేది ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒకటని వివరణ
- దీనిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉంటుందని వెల్లడి
- ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ఈ ఏడాది ఆఖరుకల్లా పరిష్కరిస్తామని వివరణ
ఉద్యోగ సంఘాలతో భేటీలో..
తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఇటీవల ఏపీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఇటీవల ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయిన బొత్స సత్యానారాయణ.. సీపీఎస్ రద్దుపై తాము తొందరపడి హామీ ఇచ్చామని పేర్కొనడం గమనార్హం.