ఆరేళ్ల పాటు ఒక్క షర్టు కూడా కొనుక్కోకుండా అప్పులు తీర్చాను: శర్వానంద్
- ఈ నెల 9న విడుదల కానున్న 'ఒకే ఒక జీవితం'
- ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శర్వానంద్
- గతంలో చేసిన 'కో అంటే కోటి' సినిమా ప్రస్తావన
- ఆ సినిమా అప్పులపాలు చేసిందంటూ వ్యాఖ్య
"చాలా కాలం క్రితం హీరోగా నేను 'కో అంటే కోటి' సినిమాను చేశాను. ఆ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేశాను. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది .. ఆర్ధికంగా నాకు నష్టాలు తెచ్చిపెట్టింది. ఆ సమయంలో నా ఫ్రెండ్స్ లో కొందరితో పాటు చాలా దగ్గరవారు కూడా దూరమయ్యారు. డబ్బుకు అంత ఇంపార్టెన్స్ ఉంటుందని అప్పటివరకూ నాకు తెలియదు.
నష్టం .. కష్టం ఎదురైతే ఇంతమంది ఇలా దూరమవుతారా? అనే విషయం నాకు అప్పుడే అర్థమైంది. ఆ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చడానికి నాకు ఆరేళ్లు పట్టింది. ఈ ఆరేళ్లలో నేను ఒక్క షర్టు కూడా కొనుక్కోలేదు. వచ్చిన ప్రతి పైసాను ఇవ్వవలసిన వాళ్లకి ఇస్తూ వెళ్లాను. ఫ్లాప్స్ వలన కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.