స్పీకర్‌కు క్షమాపణ చెప్పకుంటే చర్యలు తప్పవు!: ఈటలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరిక
- 6 నిమిషాల్లో వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ
- సీఎం చెప్పినట్లు స్పీకర్ వింటున్నారన్న ఈటల
- ఈటల వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
మంగళవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీఏసీ సమావేశం తర్వాత సమావేశమైన అసెంబ్లీ కేవలం 6 నిమిషాలకే వాయిదా పడింది. ఈ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా స్పీకర్ నడుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మంత్రి ప్రశాంత్ రెడ్డి తప్పుబట్టారు.