ఎక్స్ పోజింగ్ లో పోటీపడుతున్న కపూర్ సిస్టర్స్
- గుడ్ లక్ జెర్రీ సినిమాకు సంబంధించి ముంబైలో ప్రైవేటు స్క్రీనింగ్
- తండ్రి బోనీ కపూర్ తో కలిసి హాజరైన జాన్వీ, ఖుషీ
- ముగ్గురూ తెల్లటి వస్త్రధారణతో కనిపించిన దృశ్యం
ఈ సందర్భంగా తండ్రి, తనయలు మీడియా కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. ముఖ్యంగా జాన్వీ, కుషీ ఇద్దరూ ఎక్స్ పోజింగ్ లో పోటీ పడ్డారు. జాన్వీ అయితే పై నుంచి కింది వరకు ఒకే లాంగ్ స్కర్ట్ తో (తెల్లటి) దర్శనమిచ్చింది. బోనీ కపూర్ సైతం తెల్లటి డ్రెస్ లోనే వచ్చారు. కుషీ కూడా అదే రంగు ప్యాంట్ పై, లూజ్ గా ఉన్న బ్లౌజ్ వేసుకుని కాస్త వెరైటీ లుక్ తో కనిపించింది. ఖుషీ కపూర్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యే 'ది ఆర్చీస్' సినిమాతో త్వరలో నటనా ప్రవేశం చేయనుండడం తెలిసిందే.