రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో రవితేజ కొత్త సినిమా బిట్
- రేపు విడుదలవుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ'
- ఎడిటింగ్ రూం నుంచే లీకై ఉంటుందని అనుమానం
- ఘటనపై ఆరా తీస్తున్న చిత్ర బృందం
సినిమాలో ఓ పవర్ ఫుల్ సీన్‌కు చెందినదిగా ఆ బిట్ కనిపిస్తోంది. ప్రతి నాయకులకు రవితేజ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఆ బిట్లో కనిపించారు. ఈ వీడియో బిట్ బయటకు వచ్చినంతనే లీకేజీని పసిగట్టిన చిత్ర యూనిట్ ఘటనపై ఆరా మొదలెట్టింది. ఎడిటింగ్ రూం నుంచే ఈ బిట్ లీకై ఉంటుందని భావిస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు.