కోమటిరెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
- కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము నీకుందా? అన్న జగదీశ్ రెడ్డి
- వైయస్ పేరు చెప్పుకుని వందల కోట్లు సంపాదించారని ఆరోపణ
- డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరిక
కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము కానీ, ఆయనను ఓడించే సత్తా కానీ నీకు ఉందా? అని రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన వైయస్ రాజశేఖరరెడ్డి పేరు చెప్పుకుని వందల కోట్లు సంపాదించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని అమ్ముకుని, కాంగ్రెస్ కు ద్రోహం చేస్తూ కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నావా? అని మండిపడ్డారు. డబ్బు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని అన్నారు.