విజయ్ దేవరకొండ ధరించిన చెప్పల్స్ పై రణవీర్ సింగ్ ఆసక్తికర కామెంట్
- భాయ్ స్టయిల్ చూడండంటూ వ్యాఖ్యానించిన రణవీర్
- తాను లైగర్ ట్రైలర్ విడుదలకు వచ్చినట్లు లేదంటూ కామెంట్
- తన ట్రైలర్ విడుదలకు విజయ్ వచ్చినట్టు ఉందన్న అభిప్రాయం
ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖ నటుడు రణవీర్ సింగ్ అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా రణవీర్ సింగ్ స్టెప్స్ వేసి అక్కడున్న వారిలో జోష్ పెంచే ప్రయత్నం చేయగా, ఆయనతోపాటు విజయ్ దేవరకొండ కూడా స్టెప్స్ వేశాడు. ఈ సమయంలో విజయ్ కాలికి హవాయి చెప్పల్స్ ధరించి కనిపించాడు. ఖాకీ రంగు ఖార్గో పాంట్, బ్లాక్ టీషర్ట్ తో డ్యాన్స్ చేశాడు. దీన్ని రణవీర్ సింగ్ గమనించాడు.
‘‘సోదరుడి స్టయిల్ చూడండి. చూస్తే నేను ఆయన ట్రైలర్ (లైగర్) కార్యక్రమానికి వచ్చినట్టు కాకుండా.. ఆయనే నా ట్రైలర్ విడుదలకు వచ్చినట్టుగా ఉంది’’ అంటూ విజయ్ సింపుల్ స్టయిల్ ను రణవీర్ సింగ్ అభినందించాడు. పలు కార్యక్రమాల్లో చెప్పల్స్ తో కనిపించే జాన్ అబ్రహంతో విజయ్ ను పోల్చాడు. విజయ్ తో కలసి నటించిన అనన్య పాండే, సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘‘నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని పిలవని రోజు కోసం చూస్తున్నాను. ఇది భారతీయ సినిమా, మనమంతా భారత నటులం. మనం చూడాల్సింది ఇదే’’ అని వ్యాఖ్యానించాడు.