చిరంజీవి కోసం 'మెగా ప్రివ్యూ' వేసిన ఆమిర్ ఖాన్.. స్పెషల్ గెస్టులు వీరే!
- విడుదలకు సిద్ధంగా ఉన్న ఆమిర్ చిత్రం 'లాల్ సింగ్ చద్దా'
- చిరంజీవి నివాసంలో ప్రివ్యూ వేసిన ఆమిర్
- హాజరైన నాగార్జున, రాజమౌళి, సుకుమార్, నాగచైతన్య
మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆమిర్ ఖాన్, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు. తాజాగా తన మిత్రుడు చిరంజీవి కోసం 'మెగా ప్రివ్యూ'ను వేశారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షో ఇదే కావడం గమనార్హం. హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ వేశారు. ఈ ప్రివ్యూకు ప్రత్యేక అతిథులుగా అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, ప్రముఖ దర్శకులు రాజమౌళి, సుకుమార్ లు హాజరయ్యారు.