వాళ్లందరూ చిల్లర వ్యక్తులు.. ‘ధాకడ్’ పరాజయంపై కంగనా రనౌత్
- వ్యతిరేక ప్రచారమే సినిమా పరాజయానికి కారణమన్న కంగన
- తన నిర్మాత ఆస్తులు, ఆఫీసులు అమ్ముకోలేదన్న నటి
- సినిమాపై నిర్మాత సంతృప్తికరంగానే ఉన్నారని వ్యాఖ్య
తన సినిమాపై ఇప్పటికీ ఇంటర్నెట్‌లో వందలాది వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, వాటిని తాను చదువుతున్నానని పేర్కొన్నారు. వీటివల్లే తన సినిమా ప్లాప్ అయిందన్న కంగన.. గంగూబాయి కఠియావాడి, జుగ్‌జుగ్‌జీయో, 83 సినిమాల ప్లాప్‌ల గురించి వారు ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. కాగా, అర్జున్ రాంపాల్, దివ్యదత్తా, కంగన తదితరులు నటించిన ఈ సినిమాను రూ. 80 కోట్ల బడ్జెట్‌తో కొత్త దర్శకుడు రజనీష్ ఘాయ్ తెరకెక్కించారు. కంగన కెరియర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా కేవలం రూ. 4 కోట్లు మాత్రమే వసూలు చేసింది.