ఇళయరాజాకు శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్
- ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసిన కేంద్రం
- రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసిన కేంద్ర సర్కార్
- నా ప్రియమిత్రుడికి అభినందనలు అని ట్వీట్ చేసిన రజనీకాంత్
రాష్ట్రపతి కోటాలో పలు రంగాలకు చెందిన నలుగురిని నామినేట్ చేస్తూ నరేంద్ర మోదీ సర్కారు నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో ఇళయరాజాతో పాటు ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటీ ఉష, వీరేంద్ర హెగ్డేలను ఎన్డీఏ సర్కారు రాజ్యసభకు నామినేట్ చేసింది.