ఈ నెలలో రిలీజ్ డౌటే .. ఆలోచనలో పడిన 'కార్తికేయ 2'
- సీక్వెల్ గా రూపొందిన 'కార్తికేయ'
- నిఖిల్ జోడీగా కపినించనున్న అనుపమ
- ఈ నెల 22న రిలీజ్ చేయాలనుకున్న టీమ్
- నిర్ణయాన్ని మార్చుకున్నారంటూ ప్రచారం
ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు. కానీ ఇప్పుడు ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాక పోవడమే అందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా అదే రోజున చైతూ 'థ్యాంక్యూ' .. సుదీప్ 'విక్రాంత్ రోణ' సినిమాలు విడుదలకు ఉండటం కూడా మరో కారణంగా వినిపిస్తోంది. అయితే 'కార్తికేయ 2' కంటెంట్ .. దాని జోనర్ వేరు. వేరే సినిమాలు దీనికి పోటీ అనుకోలేం. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావలసిందే.