మాట ఇచ్చారు.. మోదీ వచ్చారు: కిషన్ రెడ్డి
- మోదీకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి
- ఏడాదంతా అల్లూరి జయంత్యుత్సవాలు నిర్వహిస్తామన్నకిషన్ రెడ్డి
- అల్లూరి నడచిన అన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో వేడుకలు ఉంటాయని వెల్లడి
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజల తరఫున ఆయనకు స్వాగతం పలికారు. ఏడాదంతా ఈ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. అల్లూరి నడయాడిన దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుపుతామన్నారు. ఈ ఏడాదంతా అల్లూరి పేరు మారు మోగాలన్నారు. భీమవరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. అల్లూరి వారసులను సన్మానించారు.