రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద తళుక్కుమన్న అమితాబ్ బచ్చన్
- సినిమా షూటింగ్ కోసం వచ్చిన బాలీవుడ్ లెజెండ్
- కొంత కాలంగా హైదరాబాద్ లో ప్రాజెక్టు కే షూటింగ్
- రైలు సన్నివేశంలో కనిపించిన అమితాబ్
అమితాబ్ బచ్చన్ 'ప్రాజెక్టు కె' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంత కాలంగా హైదరాబాద్ పరిసరాల్లోనే జరుగుతోంది. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన నటీనటులు. ఓ మెట్రో యూజర్ రెడిట్ నెట్ వర్క్ లో అమితాబ్ షూటింగ్ గురించి పోస్ట్ పెట్టాడు.
‘‘నాకు తెలిసి అమితాబ్ షూటింగ్ కోసం వచ్చి ఉండొచ్చు. ఓ బ్లూ లైన్ ట్రెయిన్ లోకి ఎవరినీ అనుమతించలేదు. నేను అమీర్ పేట స్టేషన్లో సాయంత్రం 6 గంటలకు వేచి ఉన్నాను. మెట్రో ఒక డమ్మీ రైలును రద్దీ వేళల్లో ఎందుకు నడిపిస్తోందో నాకు అప్పుడు అర్థం కాలేదు. రైలులో అమితాబ్ కనిపించలేదు కానీ, మెడలో ఐడీ కార్డులు వేసుకున్న కెమెరామ్యాన్ లు కనిపించారు’’ అని పేర్కొన్నాడు.