'పంచాంగం' వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన నటుడు మాధవన్
- ఇస్రో ప్రయోగాలకు పంచాంగంతో లింకు పెట్టిన మాధవన్
- అంగారక యాత్ర పంచాంగం వల్లే విజయవంతమైందని వెల్లడి
- ట్రోల్ చేసిన నెటిజన్లు
- తనది అజ్ఞానమేననన్న మాధవన్
దీనిపై మాధవన్ ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. అయితే ఇక్కడ మాధవన్ తమిళ భాష అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు.
"పంచాంగాన్ని 'పంచాంగ్' అంటూ తమిళంలో చెప్పే ప్రయత్నం చేసినందుకు ఈ విమర్శలు రావడంలో తప్పులేదు. నాది అజ్ఞానమే. ఈ విమర్శల తాకిడికి నేను అర్హుడ్నే. అయితే మార్స్ మిషన్ కేవలం 2 ఇంజిన్ల సాయంతోనే విజయవంతం అయ్యిందన్న వాస్తవాన్ని ఈ వ్యవహారం దాచలేదు. ఇదొక రికార్డు కూడా. నంబి రూపొందించిన వికాస్ ఇంజిన్ ఓ రాక్ స్టార్" అని మాధవన్ వివరించారు.
మాధవన్ ప్రస్తుతం భారత అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా 'రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్' అనే చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే పంచాంగం వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు.