దసరా బరిలో అఖిల్ 'ఏజెంట్'
- సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్'
- హీరోయిన్ గా సాక్షి వైద్య పరిచయం
- విడుదల తేదీలో మార్పు
- దసరా బరిలోకి దిగనున్న సినిమా
ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ రోజున థియేటర్లకు రావడం లేదు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు కొంత సేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. అయితే దసరాకి గట్టి పోటీ ఉన్న సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్న సమయానికి పనులు కాకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
అఖిల్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన కథానాయికగా సాక్షి వైద్య పరిచయమవుతోంది. ఒక కీలకమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నాడు. హిపాప్ తమిళ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో అఖిల్ భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.