రాజమౌళి చిత్రంలో నటించబోతున్న ఐశ్వర్యారాయ్?
- మహేశ్ బాబుతో రాజమౌళి తదుపరి చిత్రం
- ఆ చిత్రంలో ఐశ్వర్య ఒక లీడ్ రోల్ లో కనిపిస్తుందని ప్రచారం
- త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మహేశ్ తరదుపరి చిత్రం
రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలోనే ఐశ్యర్య నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటించేందుకు మహేశ్ రెడీ అవుతున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.