'విక్రమ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నితిన్ సినిమా సాంగ్ రిలీజ్!
- కమల్ హీరోగా రూపొందిన 'విక్రమ్'
- ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న నితిన్
- ఈ రోజున తెలుగు వెర్షన్ 'విక్రమ్' ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా రానున్న వెంకటేశ్
తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ - శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వెంకటేశ్ రానున్నారు. కమల్ .. వెంకీల మధ్య 'ఈనాడు' సినిమా నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కమల్ చేతుల మీదుగా నితిన్ 'మాచర్ల నియోజక వర్గం' సినిమాకి సంబంధించిన ఫస్టు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కృతి శెట్టి - కేథరిన్ కథానాయికలుగా అలరించనున్నారు. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.