బాలకృష్ణ సరసన ఛాన్స్ కొట్టేసిన మెహ్రీన్?
- 'ఎఫ్ 2' తరువాత హిట్ లేని మెహ్రీన్
- 'ఎఫ్ 3' పైనే పెట్టుకున్న ఆశలు
- అనిల్ నెక్స్ట్ మూవీ బాలయ్యతో
- ఆ సినిమా కోసం ఆమె ఎంపిక జరిగిందంటూ టాక్
ప్రస్తుతం బాలకృష్ణ .. గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ కథ తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరుగుతుందనీ, కూతురు పాత్రలో శ్రీలీల చేయనుందని ఆయనే అన్నాడు.
ఇక ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఆయన మెహ్రీన్ ను తీసుకున్నాడనే టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో తన మార్కు కామెడీ తక్కువగా ఉంటుందనీ, బాలయ్య మార్కు యాక్షన్ ఎక్కువగా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. దసరాకి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.