'అంటే .. సుందరానికీ' సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు!
- సుందరం పాత్రలో నాని
- దర్శకుడిగా వివేక్ ఆత్రేయ
- ఈ నెల 9న లిరికల్ సాంగ్ రిలీజ్
- జూన్ 10వ తేదీన సినిమా విడుదల
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ ఒక రేంజ్ లో రీచ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'ఎంత చిత్రం' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.
ఈ నెల 9వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు ఈ పాటను వదలనున్నారు. ఈ పాట యూత్ కి ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందో చూడాలి. నదియా .. రోహిణి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, నరేశ్ .. సుహాస్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.