గీతా ఆర్ట్స్ లో 'కార్తికేయ' దర్శకుడి భారీ చిత్రం!
- 'సవ్యసాచి' రిజల్ట్ తేడా కొట్టిందన్న చందూ మొండేటి
- చైతూకు హిట్ ఇస్తానంటూ హామీ
- 'కార్తికేయ 2' తరువాత గీతా ఆర్ట్స్ లో మూవీ ఉందన్న చందూ
- త్వరలోనే సెట్స్ పైకి వెళతామంటూ స్పష్టీకరణ
"ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ వచ్చిన మాట నిజమే .. అయితే అది నేను కావాలని తీసుకోలేదు. 'సవ్యసాచి' రిజల్ట్ విషయంలో అసంతృప్తి ఉంది. తప్పకుండా చైతూకు ఒక హిట్ ఇస్తాను. 'కార్తికేయ 2' తరువాత గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేయబోతున్నాను. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వస్తుంది.
ఇది చాలా స్పాన్ ఉన్న సినిమా .. ఆర్టిస్టుల ఎంపిక కూడా పూర్తయింది. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను విడుదలవుతుంది. ఆల్రెడీ ఈ సినిమా చాలా రోజుల క్రితమే మొదలు కావలసింది. కానీ ' కార్తికేయ 2' వలన లేట్ అవుతూ వచ్చింది. త్వరలోనే సెట్స్ పైకి వెళతాము" అని చెప్పుకొచ్చాడు.