హీరోగా రవితేజ తనయుడు ఎంట్రీ?
- రవితేజతో 'రాజా ది గ్రేట్' చేసిన అనిల్ రావిపూడి
- ఆ సినిమాలో కనిపించిన రవితేజ తనయుడు మహాధన్
- అతణ్ణి హీరోను చేసే ప్రయత్నంలో అనిల్ రావిపూడి
- అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ
రవితేజ కూడా తన తనయుడు మహాధన్ ను హీరోగా పరిచయం చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ చేసిన 'రాజా ది గ్రేట్' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో రవితేజ తనయుడు మహాధన్ కూడా కనిపించాడు. అదే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహాధన్ హీరోగా పరిచయం కానున్నాడనేది తాజా సమాచారం.
అనిల్ రావిపూడి ఒక యూత్ ఫుల్ స్టోరీని చేయాలనుకుంటున్నాడట. కాలేజ్ నేపథ్యంలో నడిచే ఈ కథలో హీరోగా మహాధన్ అయితే బాగుంటాడని భావించి, రవితేజను సంప్రదించారట. అందుకు రవితేజ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.