Kiara Advani: ప్రియుడితో విడిపోయిన కియారా అద్వాని!
![Kiara Advani breaks up with Siddharth Malhotra](https://imgd.ap7am.com/thumbnail/cr-20220423tn6263dbfa9847f.jpg)
- సిద్ధార్థ్ మల్హోత్రాతో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న కియారా
- త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ కొన్నాళ్లుగా వార్తలు
- ఇంతలోనే బ్రేకప్ చెప్పుకున్న ప్రేమ జంట
బాలీవుడ్ లో ప్రేమలు చిగురించడం.. కలిసిమెలిసి తిరగడం.. అంతలోనే బ్రేకప్ కావడం చాలా సాధారణ అంశంగా మారింది. ఇప్పటికే ఎన్నో ప్రేమపక్షులు విడిపోయాయి. తాజాగా మరో ప్రేమ జంట విడిపోయింది.
టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన కియారా అద్వాని బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటోంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో గత కొన్నేళ్లుగా ఆమె డేటింగ్ చేస్తోంది. వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఏమైందో కానీ వీరు బ్రేకప్ అయ్యారు.