నా కుమారుడి స్టార్ డమ్ వల్లే ‘బీస్ట్’ హిట్ అయ్యింది.. డైరెక్టర్ నెల్సన్ పై విజయ్ తండ్రి మండిపాటు
- సినిమాలో స్క్రీన్ ప్లే మ్యాజిక్ లేదని విజయ్ తండ్రి ఆగ్రహం
- తన కుమారుడి వల్లే సినిమాకు భారీ వసూళ్లని కామెంట్
- సినిమాపై కాస్త శ్రద్ధ పెట్టాల్సిందని వ్యాఖ్య
‘‘ఈ మధ్యనే నేను ‘బీస్ట్’ సినిమా చూశా. సినిమా హిట్ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ, అది తన కుమారుడికి ఉన్న పేరుతోనే వచ్చింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, వాటి మిషన్ వంటి సీరియస్ సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకున్నప్పుడు ఇంకాస్త వర్క్ చేయాల్సింది. ఇలాంటి సినిమాల్లో స్క్రీన్ ప్లేతో ఓ మ్యాజిక్ చెయ్యొచ్చు. కానీ, బీస్ట్ లో ఆ మ్యాజిక్ లేనే లేదు’’ అని వ్యాఖ్యానించారు.
సినిమా హిట్టయ్యింది కేవలం తన కుమారుడి స్టార్ డమ్, సంగీత దర్శకుడు, ఫైట్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్, ఎడిటర్ వల్లేనని తేల్చి చెప్పారు. డైరెక్టర్ నెల్సన్ పేరును మాత్రం ఆయన ప్రస్తావించలేదు. కాగా, బీస్ట్ సినిమా గత శుక్రవారం బాక్సాఫీసు వద్ద విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. సినిమాలోని అరబిక్ కుత్తు పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.