'అయిగిరి నందిని' స్తోత్రాన్ని ఆలపించిన చిన్నారి... ముగ్ధుడైన మోదీ... వీడియో ఇదిగో!
- ఢిల్లీలో గుజరాత్ జిల్లా పంచాయతీ నేతలతో మోదీ భేటీ
- మోదీని కలిసిన గుజరాతీ కుటుంబం
- జంకుగొంకు లేకుండా స్తోత్రం ఆలపించిన బాలిక
- వాహ్ అంటూ మెచ్చుకున్న మోదీ
ఈ సందర్భంగా మోదీని గుజరాత్ కు చెందిన ఓ కుటుంబం కలిసింది. ఆ కుటుంబంలోని చిన్నారి మోదీ ఎదుట మహిషాసుర మర్దిని స్తోత్రం చదివి ఆయనను ముగ్ధుడ్ని చేసింది. తాను ప్రధాని ఎదురుగా ఉన్నానన్న తడబాటే లేకుండా, ఎంతో కష్టసాధ్యమైన ఆ స్తోత్రాన్ని తప్పుల్లేకుండా ఆలపించి ఔరా అనిపించింది. ఆ చిన్నారి పాడుతున్నంత సేపు ప్రధాని మోదీ ఓపిగ్గా విన్నారు. ఆపై వాహ్ అంటూ ఆమెను అభినందించారు.