'శ్రీదేవి శోభన్ బాబు' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- చిరంజీవి కూతురు నిర్మాతగా 'శ్రీదేవి శోభన్ బాబు'
- గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ
- సంతోష్ శోభన్ జోడీగా గౌరీ
- సంగీత దర్శకుడిగా కమ్రన్
ఈ సినిమాకి కమ్రన్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'నిను చూశాకా మతిపోయిందే .. మది నా మాటే విననంటుందే' అంటూ ఈ పాట సాగుతోంది. రాకేందుమౌళి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను జునైద్ కుమార్ ఆలపించాడు.
హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన పాట ఇది. ట్యూన్ పరంగా కొత్తగా ఏమీ అనిపించదు. అలాగే సాహిత్యపరమైన మెరుపులు కూడా లేవు. రొటీన్ గానే అనిపిస్తుంది. తెరపై కథ నడుస్తున్నప్పుడు .. ఈ పాట వచ్చే సందర్భం వలన ఆకట్టుకుంటుందేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.