ధనుశ్ తాజా సినిమా నుంచి పోస్టర్
- ధనుశ్ హీరోగా 'నానే వరువేన్'
- దర్శకుడిగా సెల్వ రాఘవన్
- రెండు విభిన్న పాత్రల్లో ధనుశ్
- షూటింగు పార్టు పూర్తి
ఈ విషయాన్ని ధనుశ్ స్వయంగా తెలియజేస్తూ, ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ను వదిలాడు. జీప్ పై భాగంలో చాలా స్టైల్ గా ఆయన ఇచ్చిన పోజు ఆకట్టుకుంటోంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో ధనుశ్ హీరోగాను .. విలన్ గాను కనిపించనుండటం విశేషం.
ఈ సినిమా కి ధనుశ్ సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. ఎల్లి అవ్రామ్ .. ఇందుజా రవిచంద్రన్ ఈ సినిమాలో కథానాయికలుగా అలరించనున్నారు. ప్రభు .. యోగిబాబు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.