సీఎం జగన్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి
- సీఎం హోదాలో అసభ్యకర పదజాలం తగదన్న భానుప్రకాశ్
- ఏపీ పరిస్థితులపై ఢిల్లీ పెద్దలు చీదరించుకుంటున్నారని వ్యాఖ్య
- అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసభ్యకర పదజాలం వాడటం బాధాకరమన్న భానుప్రకాశ్ రెడ్డి.. వెంట్రుక పీకడానికి, గుండు కొట్టించుకోవడానికి సీఎం పదవి ఎందుకని ప్రశ్నించారు. జగన్ తన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ పరిస్థితులపై ఢిల్లీ పెద్దలు చీదరించుకుంటున్నారని ఆయన అన్నారు. రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం జగన్ విద్యుత్ అప్పులు ఎందుకు తీర్చలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.