శంకర్ మూవీలో రెండో నాయికగానే అంజలి?
- చరణ్ హీరోగా శంకర్ పాన్ ఇండియా మూవీ
- త్వరలో కొత్త షెడ్యూల్ మొదలు
- చరణ్ ద్విపాత్రాభినయం
- సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన
ఇక ఆ తరువాత నుంచి శంకర్ సినిమాపై చరణ్ దృష్టి పెట్టనున్నాడు. ఇంతవరకూ ఈ సినిమా 30 శాతం చిత్రీకరణ జరుపుకుంది. రాజమండ్రి షెడ్యూల్ సమయంలో షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. అక్కడి నుంచే మళ్లీ షూటింగు మొదలవుతుందట. ఆ తరువాత దుబాయ్ .. హైదరాబాద్ షెడ్యూల్స్ ఉంటాయని చెబుతున్నారు.
ఇదిలావుంచితే, ఈ సినిమాలో అంజలి ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. చరణ్ సరసన నాయికగానే ఆమె కనిపిస్తుందట. అయితే అది సీనియర్ చరణ్ సరసన. ఈ సినిమాలో చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడనే టాక్ వచ్చింది. సీనియర్ చరణ్ సరసన అంజలి కనిపిస్తుందనీ .. జూనియర్ చరణ్ జోడీగా కియారా ఆడిపాడుతుందని సమాచారం. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.