చంద్రబాబు మీద కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు: భానుప్రకాశ్ రెడ్డి
- పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు
- ఫ్యాన్ స్విచ్ వేసేందుకు కూడా భయపడుతున్నారు
- జగన్ వారం రోజులు గుడిసెల మధ్య నివసించాలన్న భానుప్రకాశ్ రెడ్డి
కేవలం చంద్రబాబు మీద ఉన్న కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి జనాల నడ్డి విరుస్తున్నారని అన్నారు. తాడేపల్లి ప్యాలస్ ను వదిలి జగన్ బయటకు రావాలని... ప్రజలతో కలిసి వారం రోజుల పాటు గుడిసెల మధ్య నివసించాలని సలహా ఇచ్చారు. జనాల్లోకి వస్తే వారి బాధలేంటో అర్థమవుతాయని అన్నారు.