హైదరాబాద్‌లో జూనియర్ మిట్టల్.. కేటీఆర్‌తో భేటీ
- ఇటీవలే ఆర్సెలర్ మిట్టల్ సీఈఓగా ఆదిత్య
- ఆదిత్యను కలిసిన కేటీఆర్
- తెలంగాణలో పెట్టుబడులపై చర్చించానని వెల్లడి
హైదరాబాద్ వచ్చిన ఆదిత్య మిట్టల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆరే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. హైదరబాద్ అల్లుడు కూడా అయిన ఆదిత్య మిట్టల్‌తో భేటీ అయ్యానని, తెలంగాణలో ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ పెట్టుబడుల గురించి చర్చించానని కేటీఆర్ సదరు ట్వీట్‌లో వెల్లడించారు.