మరోసారి చైతూ జోడీగా పూజ హెగ్డే!
- రీసెంట్ గా థియేటర్లకు వచ్చిన 'రాధేశ్యామ్'
- ఏప్రిల్ 13న రానున్న 'బీస్ట్'
- ఏప్రిల్ 29న విడుదల కానున్న 'ఆచార్య'
- వెంకట్ ప్రభుకు గ్రీన్ సిగ్నల్
ఈ నేపథ్యంలో ఆమె తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉండనుంది. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. ఇక ఆ తరువాత సినిమాలో ఆమె నాగచైతన్య సరసన అలరించనున్నట్టు సమాచారం.
తెలుగులో పూజ హెగ్డే ఫస్టు మూవీ నాగచైతన్యతోనే మొదలైంది. 'ఒక లైలా కోసం' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తరువాతనే ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు .. తమిళ భాషల్లో వెంకట్ ప్రభు రూపొందించనున్న సినిమాలో ఈ జంట మరోసారి కనువిందు చేయనుంది. ఈ విషయాన్ని వెంకట్ ప్రభు స్వయంగా చెప్పడం విశేషం.