'జాతిరత్నాలు' దర్శకుడిని ఫైనల్ చేసిన వెంకీ!
- వెంకీ తాజా చిత్రంగా 'ఎఫ్ 3'
- వినోదమే ప్రధానంగా సాగే కథ
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
- నెక్స్ట్ మూవీ అనుదీప్ తో
నెక్స్ట్ మూవీని ఆయన ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ పేరు వినిపిస్తోంది. కొంతకాలం క్రితం ఆయన వెంకటేశ్ కి కథ వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథకి తాజాగా వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.
ప్రస్తుతం అనుదీప్ .. శివకార్తికేయన్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగు పూర్తవగానే, వెంకీతో కలిసి సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు. సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.