నాని బర్త్ డే బ్లాస్ట్ గా 'అంటే సుందరానికీ' అప్ డేట్!
- సుందరం పాత్రలో నాని
- తెలుగు తెరకి నజ్రియా పరిచయం
- కీలకమైన పాత్రలో నదియా
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
'బ్రోచేవారెవరురా' సినిమాతో వివేక్ ఆత్రేయ తన సత్తా చాటుకున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన ఈ సినిమాను చేస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన నాని పుట్టినరోజు .. ఈ సందర్భంగా ముందురోజున సాయంత్రం 4:05 నిమిషాలకు ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను వదలనున్నారు. ఆ సమయంలో యువ సుందరుడి బర్త్ డే హోమం జరుగుతుందంటూ ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.
మరి ఆ సమయంలో మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ను వదులుతారో చూడాలి. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా నజ్రియా నజీమ్ పరిచయం కానుంది. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నదియా .. సుహాస్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.