'మహాభారత్' సీరియల్లో భీముడు, దేశం గర్వించదగ్గ అథ్లెట్ ప్రవీణ్ కుమార్ సోబ్తి మృతి
- నిన్న రాత్రి కన్నుమూసిన ప్రవీణ్ కుమార్
- కార్డియాక్ అరెస్ట్ తో మృతి
- హ్యామర్, డిస్కర్ థ్రో క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రవీణ్
ప్రవీణ్ కుమార్ కేవలం నటుడు మాత్రమే కాదు. ఆయన ఒక గొప్ప అథ్లెట్ కూడా. పలు ఈవెంట్లలో ఆయన హ్యామర్ థ్రో, డిస్కస్ థ్రో విభాగాల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఏసియన్ గేమ్స్ లో ఆయన నాలుగు పథకాలు సాధించారు. 1966, 1970 పోటీల్లో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. 1966లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో హ్యామర్ థ్రోలో సిల్వర్ మెడల్ సాధించారు. అథ్లెట్ గా ఎంతో సాధించిన ఆయన ఆ తర్వాత యాక్టర్ గా మరింత పాప్యులారిటీని సొంతం చేసుకున్నారు. 1988లో బీఆర్ చోప్రా నిర్మించిన 'మహాభారత్' సీరియల్ తో ఆయన యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించారు. ఆయనకు భార్య, కూతురు, ఇద్దరు తమ్ముళ్లు, ఒక సోదరి ఉన్నారు.