వేధింపుల కేసులో సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట
- నటి శ్రీసుధతో శ్యామ్ సహజీవనం
- పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడన్న శ్రీసుధ
- అప్పట్లో ఎస్సార్ నగర్ పీఎస్ లో కేసు నమోదు
- శ్యామ్ కు బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
- సుప్రీంను ఆశ్రయించిన శ్రీసుధ
- శ్రీసుధ పిటిషన్ కొట్టివేత
అయితే తెలంగాణ హైకోర్టు తీర్పును శ్రీసుధ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శ్యామ్ కె నాయుడు ద్వారా తనకు ప్రాణహాని ఉందని, అతడి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... శ్రీసుధ పిటిషన్ ను కొట్టివేసింది. బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.