శ్రీకాంత్ అడ్డాలకి బాలయ్య గ్రీన్ సిగ్నల్!
- 'అఖండ'తో అనూహ్య విజయం
- గోపీచంద్ మలినేనితో తాజా చిత్రం
- లైన్లో కొరటాల, అనిల్ రావిపూడి
- దిల్ రాజు బ్యానర్లోను ఓ సినిమా
ఈ నేపథ్యంలోనే బాలకృష్ణను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కలిసి ఒక కథ చెప్పాడనీ, ఆ కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ కథ బాలయ్యబాబుకి బాగుంటుందని చెప్పి ఆయన దగ్గరికి శ్రీకాంత్ అడ్డాలను పంపించినదే దిల్ రాజు అని చెబుతున్నారు.
అసలు దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల ప్రయాణం మొదలైందే దిల్ రాజు నిర్మించిన 'కొత్త బంగారు లోకం'తో. ఆ తరువాత ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' కూడా హిట్ కొట్టేసింది. ఇక ఇప్పుడు బాలకృష్ణను లైన్లో పెట్టేశారు. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలపైకి వెళుతుందనే విషయంలోనే మాత్రం క్లారిటీ రావలసి ఉంది.