'ఖిలాడీ' సినిమా రిలీజ్ కాకముందే దర్శకుడికి కోటి విలువైన కారు బహమతిగా ఇచ్చిన నిర్మాత
- రవితేజ హీరోగా 'ఖిలాడీ'
- రమేశ్ వర్మ దర్శకత్వంలో చిత్రం
- దర్శకుడికి రేంజ్ రోవర్ బహూకరించిన నిర్మాత
- కారు ఖరీదు రూ.1.15 కోట్లు
అయితే, ఈ చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ దర్శకుడు రమేశ్ వర్మకు ఎంతో విలువైన కానుక ఇవ్వడం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. రూ.1.15 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారును రమేశ్ వర్మకు బహూకరించారు. 'ఖిలాడీ' సినిమా కచ్చితంగా హిట్ అవుతుందన్న ధీమా ఉంటేనే నిర్మాత అంత విలువైన బహుమతి ఇచ్చి ఉంటాడని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.