జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర్ జవాన్ జ్యోతి విలీనం పూర్తి
- 50 ఏళ్లుగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతి
- జాతీయ యుద్ధ స్మారకం వద్ద జ్యోతి విలీనం
- ఇదే నిజమైన నివాళి అవుతుందన్న కేంద్రం
అమర్ జవాన్ జ్యోతి వద్ద అమరవీరుల పేర్లన్నీ లేకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరుల పేర్లన్నీ ఉన్నాయని, జ్యోతి ఇక్కడ ఉండడమే నిజమైన నివాళి అవుతుందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ మేరకు విపక్షాలకు వివరణ ఇచ్చింది. అమర్ జవాన్ జ్యోతిని యుద్ధ స్మారకం వద్దకు తరలిస్తున్నామని స్పష్టం చేసింది.
1971 ఇండో-పాక్ యుద్ధంలో 25,942 మంది భారత సైనికులు అమరులయ్యారు. వారందరి పేర్లను జాతీయ యుద్ధ స్మారకం (నేషనల్ వార్ మెమోరియల్) వద్ద సువర్ణాక్షరాలతో లిఖించారు.