బాలయ్యతో తలపడే పవర్ఫుల్ విలన్ ఇతగాడే!
- గోపీచంద్ మలినేనితో బాలయ్య
- కథానాయికగా శ్రుతి హాసన్
- రాయలసీమ నేపథ్యంలో సాగే కథ
- ప్రతినాయకుడిగా దునియా విజయ్
ఇది రాయలసీమ నేపథ్యంలో .. వేటపాలెంలో జరిగిన ఒక యథార్థ సంఘటన చుట్టూ అల్లబడిన కథ. తొలి షెడ్యూల్ ను వేటపాలెంలోనే జరపనున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ 'దునియా విజయ్' ను ఎంపిక చేయనున్నట్టుగా చెప్పుకున్నారు .. అది నిజమని ఇప్పుడు తేలింది. ఆయనకి వెల్ కమ్ చెబుతూ ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను వదిలింది.
కన్నడలో విలన్ పాత్రలను ఎక్కువగా చేస్తూ విజయ్ పాప్యులర్ అయ్యాడు. ఆ తరువాత హీరోగా ట్రై చేసి తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు. అప్పటి నుంచి ఆయన అక్కడ హీరోగానూ కొనసాగుతున్నాడు. కొత్తదనం కోసం ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం ఆయనను తీసుకున్నారు. ఇక కథానాయికగా శ్రుతిహాసన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.