'అతడు'కి సీక్వెల్ మాదిరిగా ఉంటుందట!
- దుబాయ్ లో ఉన్న మహేశ్ బాబు
- రాగానే 'సర్కారువారి పాట' షూట్
- ఆ తరువాత త్రివిక్రమ్ తో సెట్స్ పైకి
- ఈ కాంబినేషన్లో మూడో సినిమా
రాధాకృష్ణతో కలిసి సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించనున్నాడని చెప్పారు. అయితే కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు కేన్సిల్ అయినట్టుగా వార్తలు షికారు చేస్తున్న నేపథ్యంలో, త్రివిక్రమ్ .. తమన్ .. నాగవంశీ వెళ్లి, దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్న మహేశ్ ను కలిసి ఊహాగానాలకు తెరదించేశారు.
ఇక మహేశ్ తో త్రివిక్రమ్ చేయనున్న మూడో సినిమా కథ .. 'అతడు' సినిమాకి దగ్గరగానే ఉంటుందని అంటున్నారు. యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ. 'అతడు'కి సీక్వెల్ మాదిరిగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. 'సర్కారువారి పాట' షూటింగు పూర్తి కాగానే, త్రివిక్రమ్ తో కలిసి మహేశ్ సెట్స్ పైకి వెళ్లడానికి లైన్ క్లియర్ గానే ఉందన్న మాట.