రీమేకులు చేయనుగాక చేయను: నాని
- 'శ్యామ్ సింగ రాయ్' ప్రమోషన్స్ లో నాని
- ఈ నెల 24వ తేదీన థియేటర్లకు సినిమా
- గతంలో నిరాశ పరిచిన రీమేకులు
- ఇకపై అలాంటి ఆలోచన లేదన్న నాని
నాని మాత్రం రీమేక్ సినిమాల వైపు చూడటం లేదు .. అసలు ఆ వైపు మెడ కూడా తిప్పడం లేదు. 'శ్యామ్ సింగ రాయ్' సినిమా ప్రమోషన్స్ లో ఉన్న ఆయనకి ఈ విషయాన్ని గురించిన ప్రశ్న ఎదురైంది. అందుకు నాని స్పందిస్తూ, గతంలో తను చేసిన రెండు రీమేకులు తనకి పాఠం నేర్పడం వలన ఆ వైపు వెళ్లదలచుకోలేదని చెప్పాడు.
రీమేకులు తనకి అంతగా సెట్ కావనే విషయం తనకి అర్థమైపోయిందని అన్నాడు. తాను రీమేకులలో చేయడం కంటే, తన సినిమాలు రీమేక్ అవుతుండటం తనకి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాడు. ఇకపై కూడా రీమేకులు చేసే ఆలోచన లేదనే విషయాన్ని స్పష్టం చేశాడు. మొత్తానికి నాని రీమేకుల విషయంలో గట్టి నిర్ణయమే తీసుకున్నాడన్న మాట.