రాశి ఖన్నా 'అంతఃపురం' రిలీజ్ డేట్ ఫిక్స్!
- తమిళంలో 'అరణ్మనై 3'
- హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- తెలుగు టైటిల్ గా 'అంతఃపురం'
- ఈ నెల 31వ తేదీన విడుదల
ఆ సినిమాలో సీక్వెల్ గా తమిళంలో 'అరణ్మనై 3' సినిమా రూపొందింది. ఆర్య - రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాకి, 'అంతఃపురం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఉదయనిధి స్టాలిన్ నిర్మించిన ఈ సినిమాలో, సుందర్ తో పాటు ఖుష్బూ .. ఆండ్రియా .. సాక్షి అగర్వాల్ .. యోగిబాబు .. సంపత్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మొదటి రెండు భాగాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి
.