పోలీసు విచారణలో ఇద్దరి పేర్లు వెల్లడించిన శిల్పా చౌదరి
- సెలబ్రిటీలను మోసం చేసినట్టు శిల్పా చౌదరిపై ఆరోపణలు
- రెండ్రోజులుగా పోలీసు విచారణ
- రాధికారెడ్డికి రూ.6 కోట్లు ఇచ్చానన్న శిల్పా చౌదరి
- తనకు ఎవరూ డబ్బు ఇవ్వలేదంటున్న రాధికారెడ్డి
కాగా శిల్పా చౌదరి పోలీసు విచారణలో రాధికారెడ్డి, మరొకరి పేరును ప్రస్తావించడంతో వారిద్దరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం నాడు విచారణకు రావాలని పేర్కొన్నారు. రెండో రోజు విచారణలో శిల్పా చౌదరి వెల్లడించిన మేరకు పోలీసులు గండిపేటలోని ఆమె నివాసంలో సోదాలు చేశారు. నాలుగు బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వాటిలో రెండు ఖాతాల్లో నగదు లేదని తెలుసుకున్నారు. మరో రెండు ఖాతాలను స్తంభింపచేశారు.