యార్లగడ్డ ఇంటికి వెళ్లి పరామర్శించిన మోహన్ బాబు
- ఇటీవలే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాతృమూర్తి కన్నుమూత
- రంగనాయకమ్మ విగ్రహానికి నివాళి అర్పించిన మోహన్ బాబు
- ఆమె మృతి తనను కలచివేసిందన్న మోహన్ బాబు
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు మోహన్ బాబు అత్యంత సన్నిహితుడు. వీళ్లిద్దరిదీ దాదాపు ఐదు దశాబ్దాల అనుబంధం. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ యార్లగడ్డ తనకు అత్యంత ఆప్తుడని చెప్పారు. ఆయన తల్లిని కోల్పోవడం తనను కలచి వేసిందని అన్నారు. రంగనాయకమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.