'బంగార్రాజు' నుంచి నాగలక్ష్మిగా కృతి శెట్టి లుక్!
- షూటింగు దశలో 'బంగార్రాజు'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- చైతూ జోడీగా కృతి శెట్టి
- దర్శకుడిగా కల్యాణ్ కృష్ణ
ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన స్వర్గానికి సంబంధించిన హుషారైన పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. లుక్ పరంగా నాగార్జున కూడా మంచి మార్కులు కొట్టేశారు. తాజాగా ఈ సినిమాలో కృతి శెట్టి పోషిస్తున్న నాగలక్ష్మి పాత్రను పరిచయం చేస్తూ ఆ పాత్రకి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు.
గ్రామీణ ఎన్నికలలో నాగలక్ష్మి గెలిచి ఉంటుంది. అప్పుడు జరిపిన ఉరేగింపులో ఆమె జనాల వైపు చూస్తూ చేయి ఆడిస్తున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఆమె చేతిలో ఖరీదైన స్పెట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ కలర్ ఫుల్ లుక్ లో కృతి శెట్టి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. చూస్తుంటే 'బంగార్రాజు'లో నాగలక్ష్మి సందడి ఒక రేంజ్ లో ఉండనున్నట్టు అర్థమవుతోంది.
.