మహేశ్, త్రివిక్రమ్ మూవీలో లావణ్య త్రిపాఠి!
- తొలి సినిమాతోనే దక్కిన హిట్
- ఆకర్షణీయమైన నాయికగా గుర్తింపు
- నిరాశ పరిచిన 'చావుకబురు చల్లగా'
- డిసెంబర్ నుంచి మహేశ్ మూవీ
ప్రస్తుతం మహేశ్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో ఒక కథానాయికగా పూజ హెగ్డేను ఎంపిక చేసుకున్నారు. మరో కథానాయికగా నభా నటేశ్ పేరు వినిపించింది. కానీ తాజాగా లావణ్య త్రిపాఠి పేరు తెరపైకి వచ్చింది. సెకండ్ హీరోయిన్ గా ఆమెను తీసుకున్నారని అంటున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమా డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఫస్టు షెడ్యూల్లో ఒక సోలో సాంగ్ ను .. ఒక యాక్షన్ సీన్ ను తీస్తారట.